సొంతిళ్లు లేని వారికి గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన..!

-

తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ లో రూ.2,91,159 కోట్లుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. రైతులకు పెద్ద పీట వేసినట్టు తెలిపారు. రూ.72,659 కోట్లను వ్యవసాయ రంగానికి కేటాయించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పై కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు రూ.5లక్షలు సాయం చేయనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి రూ.3,500 ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు రూ.6లక్షలు సహాయం అందిస్తామని తెలిపారు. ఇక రాష్ట్రం మొత్తం 4లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతామని వివరించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖకు రూ.29, 816 కోట్లు. మహాలక్ష్మి ఉచిత రవాణాకు రూ.723 కోట్లు, అప్పులకు వడ్డీల కోసం రూ.17,729 కోట్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 

Read more RELATED
Recommended to you

Latest news