కేంద్రానికి తెలంగాణ 3 లక్షల కోట్ల ఇస్తుంది – అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

-

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి అన్యాయం జరిగిందంటూ అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ నడుస్తుంది. ఏపీకి భారీగా నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకి మొండి చెయ్యి చూపిందని సీఎం రేవంత్ మండిపడుతున్నారు.. మోదీ సర్కార్ పై విపక్షాలు అన్నీ ఒంటి కాలి మీద లేస్తున్నాయి.. అత్యధిక ఎంపీ స్థానాలు ఇచ్చిన తెలంగాణకి మోదీ ప్రభుత్వం చూపిందని బిఆర్ ఎస్ తో పాటు కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తుంది..

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ మీద జరిగిన చర్చ హాట్ హాట్ గా జరిగింది.. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల సభ్యులు మోదీ సర్కార్ తీరుపై చర్చించారు. బీజేపీకి బిఆర్ ఎస్ పరోక్షంగా సహకారం అందిస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తే.. బీజేపీ మీద రేవంత్ ఎందుకు పోరాటం చెయ్యడం లేదని బిఆర్ ఎస్ ప్రశ్నించింది.. ఈ సమయంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, సీఎం రేవంత్ మధ్య జరిగిన ఫైట్ సభకి హైలెట్ గా నిలిచింది.. ఇద్దరి మధ్య పరస్పర మాటలయుద్దం జరిగింది.

ఈ క్రమంలో సీఎం రేవంత్ ఆసక్తికర లెక్కలు సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణకు కేంద్రం భారీగా ఆదాయం సమకూరుస్తోందని.. కానీ అందులో సగం కూడా తిరిగి రాష్ట్రానికి రావడం లేదన్నారు. తెలంగాణ కేంద్రానికి ఇచ్చేదే ఎక్కువు… తిరిగి తీసుకునేది చాలా తక్కువగా వుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యానించారు..

తెలంగాణ రాష్ర్టం కేంద్రానికి పన్నుల రూపంలో ఏకంగా రూ.3 లక్షల కోట్లను ఇస్తోందట. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.అయితే కేంద్రం మాత్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తూ కేవలం లక్షా 68 కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి ఇస్తోందని సీఎం రేవంత్ వివరించారు. ఈ లెక్కన చుస్తే తెలంగాణ ఇచ్చిన దాంట్లో కేవలం సగమే కేంద్రం తిరిగి ఇస్తోంది అన్న‌మాట‌. కేవలం ఒక్క తెలంగాణకే కాదు దక్షిణాది రాష్ట్రాలన్నింటికి ఎన్డిఏ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సభలో రేవంత్ ఫైర్ అయ్యారు..
బిహార్ విషయమే చూసుకుంటే ఆ రాష్ట్రం కేంద్రానికి ఒక రూపాయి ఇస్తే తిరిగి వారికి 7 రూపాయల 26 పైసలు ఇస్తున్న్ట‌లు లెక్క‌లు చెబుతున్నాయని అన్నారు.. .

Read more RELATED
Recommended to you

Latest news