తెలంగాణ బడ్జెట్ 2024.. నీటిపారుదల శాఖకు రూ. 22,301 కోట్లు

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి పెద్దఎత్తున కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో ఈ పద్దులో నీటిపారుదల శాఖ – రూ. 22,301 కోట్లు కేటాయించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 73 ప్రాజెక్టులు చేపట్టగా 42 ప్రాజెక్టులు పూర్తి చేయగా.. మరో 31 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని బడ్జెట్‌ లో పేర్కొన్నారు. తుది దశలో ఉన్న, ఆయకట్టు తక్షణం పెంచే ఆరు ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో, వచ్చే ఏడాది 12 ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

మరోవైపు ఈ బడ్జెట్‌ లో విద్యుత్‌ రంగానికి ప్రభుత్వం 16వేల 410 కోట్ల రూపాయలు కేటాయించింది. నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా అందించాలన్నది ప్రధాన లక్ష్యమని పేర్కొంది. గత ప్రభుత్వ ఆర్థిక క్రమ శిక్షణా రాహిత్యానికి విద్యుత్ సంస్థలు బలయ్యాయని చెప్పారు. విద్యుత్ సరఫరా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించినా ప్రజలు వాస్తవాలు గ్రహించారన్నారు. పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా సరఫరాలో నష్టాలు తగ్గిస్తామని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news