BREAKING : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు 100 రోజులు పూర్తి అయింది. ఒక వైపు భగభగ మండే ఎండలు, మరోవైపు ఆకాశం చిల్లులుపడిందా అన్నట్లు పడే అకాల వర్షాలు.. గాలి దుమారాలు, నిప్పుల కొలిమిలోంచి వస్తున్నాయా అనిపించే వేడిగాలులు వంటి అత్యంత కఠిన వాతావరణ పరిస్థితులు నడుమ వంద రోజులు, 1150 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం అంటే మామూలు విషయం కానే కాదు.
అత్యంత విషమ పరిస్థితుల నడుమ ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి మొదలై.. అనితర సాధ్యంగా శుక్రవారం నాటికి 100 రోజుల పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి నుంచి ఉదయం 7:30 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుంది. కేతేపల్లి, చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతుంది. ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్ ఉంటుంది
సీఎల్పీ నేత పాదయాత్ర బృందం రాత్రికి కొప్పోలు గ్రామంలో బస చేస్తారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.