BREAKING : ఈటెల రాజేందర్ అనుచరుడి పై ఫొక్సో కేసు నమోదు

-

బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఊహించని షాక్ తగిలింది. ఈటెల అనుచరుడు పై ఫోక్సో కేసు నమోదు అయింది. జమ్మికుంటకు చెందిన ఓ బాలికను లైంగికంగా వేధించిన ఓ వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు అయినట్లు జమ్మికుంట సిఐ రామచందర్రావు తెలిపారు.

జమ్మికుంట పట్టణ పరిధిలోని ఆవాది జమ్మికుంట గ్రామానికి చెందిన ఎమ్మెల్యే లీడర్ రాజేందర్ అనుచరుడు కొమ్ము అశోక్ లైంగికంగా వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడి పై ఫోక్సు చట్టం కింద కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట సీఐ రామచంద్రారావు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news