ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త.. ఉచితంగా ఎంసెట్‌ కోచింగ్‌..

-

తెలంగాణ సర్కార్‌ రాష్ట్రంలోని ఇంటర్‌ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇకపై ఎంసెట్ శిక్షణ కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టాల్సిన పనిలేదని, వేలకువేలు ఫీజులు చెల్లించాల్సిన పని కూడా లేకుండా… ప్రభుత్వమే ఉచితంగా వారికి ఎంసెట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. డిసెంబరులోనే సిలబస్ పూర్తి చేసి జనవరి, ఫిబ్రవరిలో కళాశాలల్లోనే ఎంసెట్ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటించారు. శిక్షణ కోసం మెరిట్ విద్యార్థులను గుర్తించేందుకు ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహిస్తారు.

Ts Inter First Year result: After 6 student suicides, Telangana govt passes  students who failed inter exams

ఆ తర్వాత గ్రూప్ వారీగా ప్రతి జిల్లాలో 50 మంది అబ్బాయిలు, 50 మంది అమ్మాయిలను ఎంపిక చేస్తారు. మార్చిలో వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత ఏప్రిల్, మే నెలలో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇస్తారు. మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు. మోడల్ స్కూళ్లు, గురుకుల విద్యా సంస్థల ప్రాంగణాల్లో వీరికి ఉచిత శిక్షణ ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news