జూబ్లీహిల్స్ పబ్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌..నిందితుల DNA సేకరింపు !

-

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ పబ్ ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో.. 6 నిందితుల డి ఎన్ ఎ సేకరణకు కోర్టును ఆశ్రయించారు హైదరాబాద్‌ పోలీసులు. 5 గురు మైనర్ల తో సహా సాద్ధిదూన్ డిఎన్ఏ సేకరణ కు జువెనైల్ బోర్డ్ తో పాటు కోర్టు అనుమతి కోరారు పోలీసులు. డిఎన్ ఏ సేకరించి ల్యాబ్ కు పంపనున్న పోలీసులు… ఇప్పటికే ఇన్నోవాలో సేకరించిన ఆధారాలతో సరిపోల్చనున్నారు.

విచారణ లో సైంటిఫిక్ ఎవిడెన్స్ గా కీలకం కానున్న డిఎన్ఎ రిపోర్ట్… అవసరమైతే బాధితురాలి డి ఎన్ ఎ శ్యాంపుల్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఘటన పై కోర్టు లో బాధితురాలి స్టేట్మెంట్ తీసుకున్నారు. అలాగే… నిందితుల పాస్పోర్ట్ లు సీజ్ కు కోర్టు ను అశ్రయించనున్నారు పోలీసులు. బెయిల్ లభిస్తే దేశం వదిలి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు పోలీసులు. ఇక ఇప్పటికే 6 నిందితుల బెయిల్ పిటీషన్ తిరస్కరించింది కోర్టు. తాజాగా డీఎన్‌ఏ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news