నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా

-

తెలంగాణలో  ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై పూర్తి విచారణ చేయిస్తుండగా.. ఈ వ్యవహారాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌ వద్ద ఆందోళన చేయనుంది.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ లక్ష్మణ్‌ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు బీజేపీ ధర్నా చేయనుంది. ఈ ధర్నాలో కమలం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొననున్నారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాంగ్మూలం ఉన్నప్పటికీ… ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలేదని బీజేపీ ఆరోపిస్తోంది. బీఎల్‌. సంతోష్‌ను లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు గత ప్రభుత్వం తెర తీయడంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఈ క్రమంలోనే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని ధర్నా చౌక్‌ వేదికగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news