అసెంబ్లీలో చర్చించాకే అధికార చిహ్నంపై నిర్ణయం: సీఎం రేవంత్‌రెడ్డి

-

తెలంగాణ అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు విషయాలపై ఇంకా విస్తృతంగా చర్చలు జరపాల్సి ఉందని అన్నారు. వీటిపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్‌ 2న రాష్ట్ర గీతాన్ని మాత్రమే ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. గురువారం రోజున సెక్రటేరియట్‌లో మంత్రులు, వివిధ పార్టీల నాయకులు తదితరులతో సమావేశమైనప్పుడు కూడా అధికార చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంపై అనేక సూచనలు వచ్చాయని, దీనిపై ఇంకా విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకొంటామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు చిత్రకారుడు రుద్ర రాజేశం అధికార చిహ్నంపై కసరత్తు చేస్తున్నారు. కొత్త చిహ్నంలో రాచరిక గుర్తులు లేకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. కాకతీయ తోరణం, చార్మినార్‌లు కొత్త చిహ్నంలో లేకుండా రూపొందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news