బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ : సీఎం రేవంత్ రెడ్డి

-

రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ  కుట్ర చేస్తున్నారని ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నాల్లోనే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.   సోమవారం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గజనీ మహమ్మద్ హిందుస్తాన్ ను దోచుకోవడానికి ప్రయత్నించినట్లు.. రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన ప్రయత్నం ఫలించడంలేదన్నారు.

ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు.. భారతీయ జనతాపార్టీ పేరుతో చలామని అవుతున్న బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు రాహుల్ గాంధీ నిలబడ్డారన్నారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలసి నడవాలని.. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని.. ఇది ఒక యుద్ధం అన్నారు. ఈ యుద్ధం గాంధీ పరివార్ కు గాడ్సే పరివార్ మధ్య జరుగుతుందన్నారు. గాడ్సే పరివార్ వైపు నుంచి మోడీ.. గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాడుతున్నారని.. అందుకే మనమంతా గాంధీ పరివార్ గా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలబడాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news