టార్గెట్ ప్రకాష్‌రాజ్: కేసీఆర్‌ని ఇరికిస్తున్న కమలం..!

-

తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు వార్ నడుస్తున్న విషయం తెలిసిందే..ఇప్పటికే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి…అసలు ఒకరికొకరు చెక్ పెట్టుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రాజకీయం నడిపిస్తున్నారు. పైగా ఇటీవల కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు…కేంద్రంలోని మోడీ సర్కార్‌ని గద్దె దించడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. అందుకే దేశంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలని కలుస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలని ఏకం చేయాలని చూస్తున్నారు.

తాజాగా కూడా మహారాష్ట్ర వెళ్ళి..శివసేన అధ్యక్షుడు, సీఎం ఉద్ధవ్ థాకరేని, అలాగే ఎన్‌సి‌పి అధినేత శరద్ పవార్‌ఇన్ కలిసిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్‌తో పాటు ప్రకాష్ రాజ్ సైతం..వారిని కలిసిన వారిలో ఉన్నారు. సినిమా యాక్టర్‌గా ఉన్న ప్రకాష్ రాజ్ ఎప్పటినుంచో బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న విషయం తెలిసిందే. అలాగే ఆయన సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి.

ఇక కేసీఆర్, ప్రకాష్ రాజ్‌ని వెంటబెట్టుకుని తిప్పడంపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తుక్‌డే గ్యాంగ్ సభ్యుడిని మధ్యవర్తిగా పెట్టుకుని సీఎం కేసీఆర్ ముంబై వెళ్లి ఉద్దవ్ థాకరేను కలిశారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దేశ ప్రజలు వ్యతిరేకించిన వ్యక్తితో కేసీఆర్ కలిశారని, ఇటీవల కూడా మా ఎన్నికల్లో ప్రకాష్ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.

దేశ ఐక్యతను, భారత్ సైనిక శక్తిని ప్రకాశ్ రాజ్ అవమానించారని, తుక్‌డే గ్యాంగ్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన ప్రకాశ్ రాజ్‌తో కలిసి వెళ్లడంవల్ల దేశానికి, తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఏం సందేశం ఇస్తున్నారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్‌ వల్ల కేసీఆర్‌కు కాస్త మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి…ఎందుకంటే ప్రకాష్ రాజ్ పలు సందర్భాల్లో హిందూత్వాన్ని అవమానించారనే విమర్శలు ఉన్నాయి..కాబట్టి ప్రకాష్ రాజ్ విషయంలో ప్రజలు పెద్దగా పాజిటివ్‌గా లేరని చెప్పొచ్చు..అందుకే ప్రకాష్ రాజ్‌ని బీజేపీ టార్గెట్ చేసి కేసీఆర్‌ని ఇరుకున పెట్టాలని చూస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news