తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముత్యాలమ్మ గుడి ఘటన పై సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. మరోవైపు గ్రూపు-1 అభ్యర్థులు ఆందోళన చేపడుతుంటే వారి సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభ్యర్థులు తాము తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకున్నాం. తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారంగా జవాబులు రాస్తాం అంటున్నాయి. అయితే దీనికి సమాదానం చెప్పాల్సిన బాధ్యత సీఎంకి లేదా..? అని ప్రశ్నించారు. మొదటి సారి విడి విడిగా రెండు హాల్ టికెట్లు పెట్టారు. అన్నింటికి ఒకే హాల్ టికెట్ ఉండేది. ఏ ప్రాతిపదికన విద్యార్థులు చదువుకోవాలి. వికిపీడియా ద్వారా విద్యార్థులకు మార్కులు ఇవ్వబోతున్నారా..? అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో యువత మళ్లీ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రికి ఎందుకు అంత పట్టుదల అని ప్రశ్నించారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ రెండు ఒక్కటేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.