గులాబీపై ‘ఐటీ’ పిడుగు..కేసీఆర్ వార్నింగ్..చిక్కుల్లో పడతారా?

-

సరిగ్గా 8 నెలల క్రితం..కీలక నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీ, సి‌బి‌ఐ దాడులు జరగవచ్చని, కాబట్టి నేతలు అలెర్ట్ గా ఉండాలని తప్పులు చేయవద్దని, కేంద్రం మనపై కక్ష కట్టిందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బందులు పెట్టవచ్చని, కాబట్టి నేతలు జాగ్రత్తగా ఉండాలని, ఐటీ, ఈడీ, సి‌బి‌ఐ వారికి ఆస్కారం ఇవ్వకూడదని చెప్పి తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్..తమ పార్టీ నేతలకు సూచించారు.

నవంబర్ 2022లోనే పార్టీ సమావేశంలో క్లియర్ గా చెప్పారు. ఇక ఆ తర్వాత నుంచే పెద్ద ఎత్తున ఐటీ, ఈడీ, సి‌బి‌ఐ రైడ్స్ మొదలయ్యాయి. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వచ్చిన విషయం తెలిసిందే. ఆమెని పలుమార్లు విచారించారు. మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి..అలాగే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి ఇలా కీలక నేత ఇళ్ళు, ఆఫీసులు, పార్టీ కార్యాలయాలు, కాలేజీలు, ఇతర సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి.

తాజాగా ఎమ్మెల్యేలు ఫైళ్ళ శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి..ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇళ్ళు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ఇలా గులాబీ పార్టీపై ఐటీ పిడుగులు పడ్డాయ. అయితే ఈ దాడుల నేపథ్యంలో నాయకులు కంగారు పడవద్దని తాను అండగా ఉంటానని కే‌సి‌ఆర్ చెబుతున్నారు. అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలని..ఈ సమయంలో ఆస్తుల వివరాలు బయపడితే ప్రజల్లోకి నెగిటివ్‌గా వెళుతుందని, అలాగే పార్టీకి ఫండింగ్ విషయంలో ఇబ్బందులు వస్తాయని, ఎన్నికల సమయంలో ఇలాంటివి జరగడం వల్ల ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తుతాయని బి‌ఆర్‌ఎస్ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది.

అయితే ఎన్నికల సమయం దగ్గరపడే కొద్ది ఈ దాడులు మరిన్ని జరగవచ్చని, కాబట్టి నేతలు ముందు జాగ్రత్తగా ఉండాలని బి‌ఆర్‌ఎస్ అధిష్టానం కోరుతుంది. మొత్తానికి ఐటీ దాడులు గులాబీ పార్టీపై పిడుగు పడినట్లు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news