హైదరాబాద్ లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

-

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూలు మార్చి రెండో వారంలో విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రచారం జరుగుతున్న వేళలోనే బిఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. గోదావరి కృష్ణా జలాలపై టిఆర్ఎస్ నీటి పోరు యాత్ర చేయనున్నట్లు తెలిసింది. కాలేశ్వరం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి ఫోర్ యాత్రను బీఆర్ఎస్ ప్రారంభం చేసింది.

ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత టిఆర్ఎస్ నల్లగొండలో భారీ సభ నిర్వహించింది. ఈ సభలో కేసీఆర్ హాజరై కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చేరిగారు. కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పగించడాన్ని నిరసిస్తూ ఈ సభలో కేసీఆర్ ప్రసంగించారు. తాజాగా హైదరాబాదులో సభ నిర్వహించాలని ఫిక్స్ అయిన టిఆర్ఎస్ అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడారు అనేది సస్పెన్స్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news