బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

-

BRS పార్టీ కి ఊహించని షాక్ తగిలింది. హుజురాబాద్ BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డిని హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ రెడ్డి అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేశారని సమాచారం. కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ రెడ్డిని 50 లక్షలు ఇవ్వాలని బెదిరించారని కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి.

koushik reddy
BRS MLA Padi Kaushik Reddy arrested

మనోజ్ భార్య ఉమాదేవీ ఫిర్యాదు మేరకు కౌశిక్‌ రెడ్డిపై సుబేదారి పీఎస్‌లో కేసు నమోదు అయింది. తనపై తప్పుడు కేసులు పెట్టారని హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటీషన్ వేశారు కౌశిక్ రెడ్డి. కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు పోలీసులు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదంటున్నారు కౌశిక్ రెడ్డి. మరికొన్ని గంటల్లో కౌశిక్ రెడ్డిని హనుమకొండ కోర్టులో హాజరు పరచనున్నారు సుబేదారి పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news