బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేటితో ముగియనున్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు

-

భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది వేడుకల ముగింపు ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. స్వరాష్ట్రం సిద్దించి పదేళ్లు పూర్తయిన్న సందర్భంగా గులాబీ పార్టీ మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళి అర్పిస్తూ శనివారం హైదారాబాద్‌లోని అమరవీరుల స్థూపం నుంచి అమరుల స్మృతి చిహ్నం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఈ వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పురోగతి కళ్ళకు కట్టేలా ‘తెలంగాణ యాది’ పేరిట ఛాయా చిత్ర ప్రదర్శన నిర్వహించారు. వేడుకల ముగింపు రోజైన ఇవాళ అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో జాతీయ జెండా, పార్టీ జెండా ఎగురవేసి సమావేశాలు నిర్వహిస్తారు. ఆసుపత్రులు, ఇతర చోట్ల పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ‘స్టిల్ సీకింగ్ జస్టిస్’ పేరుతో రూపించిందించిన డాక్యుమెంటరీతోపాటు.. కేసీఆర్ హయాంలో రాష్ట్ర పురోగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news