C-PAC PREDICTS 11 LOK SABHA SEATS FOR BRS IN TELANGANA:భారత రాష్ట్ర సమితి (BRS) రాష్ట్రంలో 11 స్థానాలు గెలుచుకోవడం ఖాయమని సివిల్ పోల్స్ ఎనాలిసిస్ కమిటీ (C-PAC) అంచనా వేసింది. ఇది కాకుండా, శనివారం సాయంత్రం విడుదలైన C-PAC ఎగ్జిట్ పోల్స్ ప్రకారం…. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఉప ఎన్నికలో కూడా BRS విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి.
గత ఏడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో సి-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా సరైనవి కావడంతో…ఇప్పుడు నిజం కాబోతున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 33.61 శాతం ఓట్లతో బీఆర్‌ఎస్ 40 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ 55.46 శాతం ఓట్లతో 66 సీట్లు గెలుచుకుంటుందని సీ-ప్యాక్ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో విడుదలైన దాదాపు ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్‌ను పరిశీలిస్తే, లోక్‌సభ ఎన్నికల్లో BRS 11 సీట్లు గెలుచుకోవడం ఖాయమనే అంటున్నారు.