సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఈ స్థానంలో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఈ ఉపఎన్నిక జరగనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ రిజర్వ్) కు అభ్యర్థిని కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ స్థానం నుంచి ఇటీవల బీజేపీ నుంచి చేరిన నారాయణ్ శ్రీ గణేష్ పేరును ప్రకటించింది.
ఆయన అభ్యర్థిత్వాన్ని శనివారం ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆమోదించగా.. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. అయితే గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ నుంచి పోటీ చేసి 41,888 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇదే స్థానం నుంచి గద్దర్ కూతురు వెన్నెలకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వగా ఆమె 20,825 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. గద్దర్ కూతురు వెన్నెలకు కాకుండా శ్రీ గణేష్ కు కాంగ్రెస్ టికెట్ కేటాయించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.