వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు కేంద్ర సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి తాము ముందుకు వెళ్లడం లేదని వెల్లడించారు.
బిడ్ వేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న విషయంపై ఆయన స్పందిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం అనేది ఒక ఎత్తుగడ మాత్రమేనని వ్యాఖ్యానించారు. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ప్రకటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కెసిఆర్ దెబ్బ అంటే అలా ఉంటుందని అన్నారు కేటీఆర్. మేము తెగించి కొట్లాడం కాబట్టే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పై కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు. విశాఖ ఉక్కు పై మొదటి నుండి గట్టిగా మాట్లాడింది సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు.