గూగుల్‌లో మరిన్ని లేఆఫ్స్.. సుందర్‌ పిచాయ్‌ సంకేతాలు

-

గూగుల్ ఉద్యోగులకు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి షాక్ ఇచ్చారు. ఇప్పటికే 12వేల మందిని ఇంటికి పంపించిన ఈ సంస్థ.. మరికొంత మందికి టాటా చెప్పనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సుందర్‌ పిచాయ్‌ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ దిశగా సంకేతాలిచ్చారు.

కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్‌ బార్డ్‌, జీమెయిల్‌, గూగుల్‌ డాక్స్‌పై కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నట్లు పిచాయ్‌ తెలిపారు. వీటిలో ఇంకా చాలా పనిచేయాల్సి ఉందన్నారు. వీటిలో ఉన్న అవకాశాలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే తమ సిబ్బందిని అధిక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుల్లోకి తరలిస్తున్నామని పేర్కొన్నారు.

కంపెనీలో జరుగుతున్న ప్రతి పనిని క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. తద్వారా ఖర్చులను పునఃసమీక్షించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఫలితంగా కంపెనీ సామర్థ్యాన్ని మరో 20 శాతం పెంచాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆయన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే త్వరలో గూగుల్‌ మరికొంత మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news