కేసీఆర్ సర్కార్ కు షాక్…అప్పులకు అనుమతి ఇవ్వని కేంద్రం !

-

కేసీఆర్‌ సర్కార్‌ కు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రుణాలు తీసుకునేందుకు కేసీఆర్‌ సర్కార్‌ కు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది మోడీ సర్కార్‌. అందుకు గత రెండేళ్లలో తీసుకున్న బడ్జెట్‌ వెలుపలి రుణాలను కారణంగా చూపుతోంది.

ఈ రుణాలను ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌ మెంట్‌ యాక్ట్‌ – ఎఫ్‌ఆర్‌బీఎంతో సంబంధం లేకుండా బడ్జెట్‌ వెలుపలే తీసుకున్నప్పటికీ.. చెల్లింపులను మాత్రం బడ్జెట్‌ నిధుల నుంచే చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

బడ్జెట్‌ నిధుల నుంచే చెల్లింపులు చేస్తున్న నేపథ్యంలో వాటిని కూడా ఎఫ్‌ఆరబీఎం కిందకే పరిగణిస్తామని అంటోంది. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, జలవనరుల అభివృద్ధి, రహాదారి అభివృద్ధి కార్పొరేషన్‌ తదితరాల ద్వారా బడ్జెట్‌ వెలుపల రుణాలను తీసుకుంది. ఇక ఇది ఇలా ఉండగా… ఏపీకి మాత్రం.. రుణాలు తీసుకునేందుకు.. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచింది కేంద్రం. దీనిపై కేసీఆర్ సర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news