కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరు పక్కా పెట్టాల్సిందే : బండి సంజయ్

-

కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరు పక్కా పెట్టాల్సిందేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. బియ్యం కేంద్రం ఇస్తుంటే.. ఫోటో మీది పెట్టుకుంటారా..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధి పై చిత్తశుద్ది లేదు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పేర్లను మార్చితే నేరుగా లబ్దిదారులకు ఎలా ఇవ్వాలో ఆలోచన చేస్తాం. సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆపదు.

పేదలకు బీజేపీ ఎప్పుడూ అన్యాయం చేయదన్నారు. ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆసరా పింఛన్లు రూ.4వేలు ఇస్తామని ఎందుకు చెప్పారు. ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.  కేసీఆర్ డబుల్ బెడ్ రూం పేర్లతో మోసం చేశారు. డబుల్ బెడ్ రూం కట్టిస్తా అని పిట్ట కథలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చింది కానీ నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. 

Read more RELATED
Recommended to you

Latest news