మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకే తమ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి. రాజగోపాల్రెడ్డి స్వార్థం కోసమే పార్టీ మారారు.. బీజేపీని ఓడించే వారికే మద్దతు ఇవ్వాలనుకున్నామని తెలిపారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్లు వివరించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి.
తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ అని… తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడుతున్న పార్టీ తమదని..వెల్లడించారు. తెలంగాణ భవిష్యత్ దృష్ట్యా మేము నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. బీజేపీని ఓడించే శక్తి టీఆర్ఎస్ కే ఉందన్నారు చాడ వెంకట్రెడ్డి. అందుకే మేము టీఆర్ఎస్ కి మద్దతు ఇస్తున్నామని… బహిరంగ సభకు కెసిఆర్ మమ్మల్ని ఆహ్వానించారని తెలిపారు. ప్రగతి శీల శక్తుల ఏర్పాటు కు కెసిఆర్ ప్రయత్నం చేస్తున్నారని… మునుగోడు సభ కి పల్లా వెళ్తున్నారని వివరించారు. మేమే మునుగోడు లో నిలబడాలి… కానీ బీజేపీ ఓడించే వారికి మద్దతు ఇవ్వాలి అనుకున్నామన్నారు.