నాకు చంద్రబాబు గురువే.. కానీ కేసీఆర్ కి చార్లెస్ శోభరాజ్ గురువు – రేవంత్ రెడ్డి

-

ఎట్టకేలకు గురువారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక జూపల్లి చేరిక అనంతరం టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తనకు గురువని అంటున్నారని.. అవును అది నిజమేనని అన్నారు. చంద్రబాబు నాకు గురువే.. కానీ కేసీఆర్ కి ఘరానా మోసగాడు అయిన చార్లెస్ శోభరాజ్ గురువు అని అన్నారు.

కెసిఆర్ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమ హామీలను చూసే రైతు రుణమాఫీ పై నిర్ణయం తీసుకున్నారని.. ఇది కాంగ్రెస్ పార్టీ విజయమని వ్యాఖ్యానించారు. ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకొని మళ్లీ గెలిచేందుకు కుట్రలు చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news