నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది – చంద్రబాబు

నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ టీడీపీని హైదరాబాద్ లోనే స్థాపించారని.. తెలుగు ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేశానన్నారు.

1995 నుండి ఇప్పటి వరకు 28 సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడుగా నాకు అవకాశం ఇచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను.. టీడీపీ వచ్చాక తెలుగు వారి స్థాయి పెరిగింది.. టీడీపీకి వచ్చిన ప్రతి అవకాశం ప్రజల కోసమే ఉపయోగించామని వెల్లడించారు. తెలంగాణ లో టీడీపీకి పూర్వ వైభవం రావడం ఖాయం అని.. తెలంగాణలో టీడీపీ నేతలు బాగా పని చేస్తున్నా రన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మళ్ళీ కార్యకర్తలతో సందడిగా మారిందని.. తెలుగు గడ్డపైన పుట్టిన పీ.వి.నరసింహారావు ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చారని పేర్కొన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.