శ్రీవారి సన్నిధిలో హీరోయిన్​కు ఆదిపురుష్ డైరెక్టర్ కిస్.. నెటిజన్లు ఫైర్

ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై ఓవైపు నెటిజన్లు.. మరోవైపు శ్రీవారి భక్తులు ఫైర్ అవుతున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారని మండిపడుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే..?

ఆదిపురుష్ మూవీ విజయం సాధించాలని కోరుతూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను మంగళవారం రోజున సాయంత్రం స్వామివారి పాదాల చెంత నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా, దర్శనానంతరం ఆలయం బయటకు వస్తున్న కృతితో ఓం రౌత్ ప్రవర్తించిన తీరు చూసి భక్తులు ఫైర్ అవుతున్నారు. కృతి, ఓం కలిసి గుడ్ బై చెప్పుకునే సమయంలో ఓం కృతి వద్దకు వచ్చి ఆమెను హగ్ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా.. ఆమె చెంపపై ముద్దు పెట్టుకుని ఫ్లయింగ్ కిస్ కూడా ఇవ్వడం భక్తుల్లో కోపానికి కారణమైంది.