తెలంగాణ ఏర్పాటుపై ఏపీ సీఎం చంద్రబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. విభజన తర్వాత కూర్చోలేని పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ… చైతన్యం కలిగిన గడ్డ.. తెలుగు గడ్డ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని వెల్లడించారు.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ అవతరించిందని గుర్తు చేయడం జరిగింది. 2014లో తెలంగాణ విభజన జరిగిందన్నారు బాబు. ఆ సమయంలో ఎక్కడ కూర్చోవాలో తెలియని అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన ప్రారంభించామని హాట్ కామెంట్స్ చేశారు. సంస్కరణలతో.. సమర్థ నర్ణయాలతో 13.5 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆనాడు అన్ని రంగాల్లో దూసుకుపోయిందని వెల్లడించారు సీఎం చంద్రబాబు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని..ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నహదే మా నినాదం, మా విధానమని… ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అన్ని వర్గాలకు సమ న్యాయం చేసి తిరుగులేని ఫలితాలు సాధించామన్నారు.