BREAKING: తెలంగాణ విద్యార్థులకు అలర్ఠ్.. పాఠశాలల్లో పనివేళల మార్పు చేసేందుకు నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ వేళలను ఉదయం 9.30 నుండి సాయంత్రం 4.45కి బదులుగా ఉదయం 9.00 నుండి సాయంత్రం 4.15 వరకు మార్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రస్తుతం అమలు చేస్తున్న స్కూల్ టైమ్స్ కొనసాగుతాయి. అంటే ఉదయం 8.45 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటాయన్న మాట. ఇది ఇలా ఉండగా, అంగన్‌వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన విద్యా బోధన, నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం గతంలో ప్రతిపాదించినట్టుగా త్వరలోనే విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు.