అలర్ట్ : తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ లో మార్పులు..ఈ సారి 1600 మీటర్ల ఈవెంట్

-

తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం చెప్పిన విధంగానే నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. నిన్న పోలీస్ నియామాకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్పైలు కలిపి మొత్తం 16,027 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈసారి నోటిఫికేషన్ లో భారీ మార్పులు వచ్చాయి.

ఫిజికల్ ఈవెంట్స్ లో మార్పులు :

గతంలో లాగా రన్నింగ్ పురుష అభ్యర్థులకు 100 మీటర్స్, ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ నిర్వహించడం లేదు. ప్రస్తుతం పురుషులకు 1600 మీటర్లు (7 నిమిషాల 15 సెకన్లు), ఎక్స్ సర్వీస్ మ్యాన్ కు 9 నిమిషాల 30 సెకండ్ల పరుగు నిర్వహిస్తున్నారు. దీంతోపాటు లాంగ్ జంప్ 4 మీటర్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కు మూడున్నర మీటర్లు, షార్ట్ పుట్ 6 మీటర్లుగా నిర్వహిస్తున్నారు. మహిళలకు ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తున్నారు. మహిళల లాంగ్ జంప్ 2.50 మీటర్లు కాగా షార్ట్ పుట్ నాలుగు మీటర్ల గా నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news