రాజాసింగ్ ని కలిసిన చీకోటి ప్రవీణ్.. ఫోటోలు వైరల్

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రెండు నెలలుగా చెర్లపల్లి జైలులో ఉంటున్న రాజాసింగ్ కి షరతులతో కూడిన బెల్ ని మంజూరు చేసింది హైకోర్టు. అయితే నేడు రాజాసింగ్ ని కలిశారు క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్. హైదరాబాద్ లోని కోటి ఇషామియా బజారులోని సంతోషిమాత ఆలయంలో చీకటి ప్రవీణ్ పూజలు నిర్వహించారు.

అనంతరం అక్కడి నుండి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి చీకోటి వెళ్లారు. రాజా సింగ్ ని పలకరించిన ఆయన.. క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ.. హిందూ ధర్మం కోసం పోరాడే వారందరికీ అండగా ఉంటానని ప్రకటించారు. రాజాసింగ్ హిందూ ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఎంత దూరమైనా వెళ్లే వ్యక్తి అని, తాను కూడా హిందుత్వ వాదినేనని.. అందుకే రాజా సింగ్ ని కలవడానికి వచ్చారని తెలిపారు.