నిజామాబాద్ ను అందమైన పట్టణంగా తీర్చిదిద్దాలి – సీఎం కేసీఆర్

-

నిజామాబాద్ ను అందమైన పట్టణంగా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్. నిజామాబాద్ నగరంలో రోడ్ల నిడివి ఎంత వున్నదో అంచనా వేయాలన్నారు. గ్రావెల్ రోడ్లను బిటి రోడ్లుగా మార్చాలని చెప్పారు. స్మశాన వాటికలు, బరీయల్ గ్రౌండ్లు ఎన్ని కావాల్సి వున్నది..? సమీకృత మార్కెట్లు ఎన్ని కావాల్సి వున్నయి.? కమ్యునిటీ హాల్లు ఎన్ని కావాలి? డంప్ యార్డులు..వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, అన్నీ అత్యంత వేగంగా పనులు పూర్తి చేయాలన్నారు. నిజామాబాద్ లో మెత్తం దోభీ గాట్లు, సెలూన్లను అంచనావేసి మాడ్రన్ దోభీఘాట్లను మోడ్రన్ సెలూన్లను నిర్మించాలన్నారు. నిజామాబాద్ నగరంలో గార్డెన్ల పరిస్థితిని సీఎం అడిగి తెలసుకున్నారు. పబ్లిక్ గార్డెన్లను తక్షణమే మెరుగు పరచాలన్నారు.

తాను చిన్ననాడు నాటి తిలక్ గార్డెన్ లో వెల్లి కూర్చేనే వాడినని సీఎం గుర్తచేసుకున్నారు. తిలక్ గార్డెన్ ను పునరుద్ధరించాలన్నారు. మొక్కలను నాటడం పచ్చదనం పెంచే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ను సుందరీకిరించాలని సీఎం ఆధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో మొత్తం వున్న ప్రభుత్వ భూములెన్ని వాటిల్లో ప్రజావసరాలకోసం వినియోగించుకోవాడనికి ఎన్ని అనువుగా వున్నాయో ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు.

సమీకృత కలెక్టరేట్ నిర్మాణం తర్వాత పలు శాఖలు వారి కార్యాలయాలను ఖాళీ చేసాయని, ఆయా శాఖల భవనాల పరిస్థితి ఏంది..వాటి స్థలాలను, కార్యాలయ భవనాలను ప్రజావసరాలకు ఏ విధంగా వినియోగించుకోవచ్చునో ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అన్నారు.నిజామాబాద్ పట్టణాభివృద్ధి కోసం అనుసరించాల్సిన పద్దతులను ఈ సందర్భంగా సీఎం అధికారులకు వివరించారు. పౌరులకు కల్పించాల్సిన సౌకర్యాలను రూపొందించుకుని వాటికోసం చేపట్టాల్సిన నిర్మాణాత్మక పనుల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలన్నారు. దాంతో పాటు నగరాన్ని సుందరీకరించే అంశాలేమిటో పరిశీలించి అందుకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అలంకారాలేమిటి అనే ప్రణాళికలను సిద్దం చేసుకోవాల్సి వున్నదని సీఎం తెలిపారు. ‘‘నేను రెండు నెల్లల్లో నిజామాబాద్ వస్త. మీరు చేసిన పనులను పరిశీలిస్త. అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె’’ అని సీఎం అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news