ఇవాళ ప్రగతి భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం ను టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని ఫైర్ అయ్యారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరమే దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు మరోసారి భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కచ్చితంగా పెట్రోల్ రేట్లు దేశంలో పెరుగుతాయని ఇది రాసి పెట్టుకోండి అంటూ మీడియా..కు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ప్రభుత్వం అని చెప్పారు సీఎం కేసీఆర్.