‘ టూర్లు ‘ వేసే ప్లాన్ లో కేసీఆర్ ? ఇదా అసలు సంగతి ?

-

తెలంగాణ సీఎం కేసీఆర్ కు అప్పుడే టెన్షన్ మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు టిఆర్ఎస్ తెలంగాణ అంతటా వ్యాపించి ఉందని,  టిఆర్ఎస్ కు తప్ప మరో ప్రత్యర్థి పార్టీకి తెలంగాణలో అవకాశమే లేదని , అధికారం ఎప్పటికీ టిఆర్ఎస్ వైపై ఉంటుందని అంచనా వేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ కు ఎన్నికల్లో విజయాలు వరుసగా విజయాలే వస్తూ ఉండేవి.  స్థానిక , మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే విధంగా టిఆర్ఎస్ విజయం సాధించింది. కానీ అకస్మాత్తుగా వచ్చిపడిన దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి అదే స్థాయిలో ఫలితాలు వస్తాయని, తమ రాజకీయ ప్రత్యర్దులయిన కాంగ్రెస్ , బిజెపి పార్టీలకు అసలు అవకాశమే లేదని భావిస్తూ వచ్చినా, అది కూడా తలకిందులు కావడంతో,  వాస్తవ పరిస్థితి ఏమిటనేది కేసీఆర్ కు బాగా తెలిసొచ్చింది.
ఇదిలా ఉంటే , ఇప్పుడు బిజెపి దూకుడు ఎక్కువగా ఉండడంతో ఆ పార్టీ లోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కు చెందిన నాయకులంతా క్యూ కట్టే పనిలో ఉన్నారు. వారితో పాటు టిఆర్ఎస్ కు చెందిన చాలామంది నాయకులు వివిధ రకాల అసంతృప్తితో పార్టీ పై ఆగ్రహంగా ఉన్నారని,  క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ప్రభుత్వానికి రావడం , తాజాగా ఓటమి టిఆర్ఎస్ ఖాతాలో పడడం, ఇవన్నీ లెక్క వేసుకుంటున్న కేసీఆర్ జిల్లాల వారీగా పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం కారణంగా పర్యటనలకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చేజారిపోతూ ఉండడంతో , ఇక వరుసగా ఒక షెడ్యూల్ ప్రకారం జిల్లాల పర్యటన చేపట్టి,  ప్రభుత్వం తరపున అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి, ప్రజలకు మరింతగా చేరువ అయ్యి బలపడాలనే ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
కేవలం నాయకులను, అధికారులను పూర్తిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం కంటే, ఈ విధంగా పర్యటనలు చేపట్టి , వాస్తవ పరిస్థితులను అంచనా వేసి,  ప్రజల నాడి ఏంటనేది తెలుసుకుని ముందుకు వెళ్లాలని అభిప్రాయంలో కెసిఆర్ ఉన్నట్లుగా సమాచారం. అదేవిధంగా గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చేందుకు సిద్దం అవుతుండడంతో, అవసరమైతే గ్రేటర్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని, సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news