అక్టోబర్ 2న సీఎం కేసీఆర్ బహిరంగ సభ

ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 1వ తేదీన వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరంగల్ లో నూతనంగా నిర్మించిన ప్రతిమ ఆసుపత్రిని సీఎం ప్రారంభించనున్నారు. ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షించనున్నారు సీఎం. మరుసటి రోజు హైదరాబాద్ లోని ముషీరాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేస్తున్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.

గాంధీ ఆసుపత్రి వద్ద 16 ఫీట్ల గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. అక్టోబర్ రెండవ తేదీ ఉదయం 10 గంటలకు సీఎం చేతుల మీదుగా విగ్రహం ఆవిష్కరణ జరుగుతుంది. అనంతరం ఆసుపత్రి ప్రంగణంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతారు. అయితే ఈ సభలో జాతీయ పార్టీకి సంబంధించి సీఎం కేసీఆర్ ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 2న కేసీఆర్ ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.