నల్గొండ టౌన్ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష

-

నల్గొండ టౌన్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.గురువారం నార్కట్ పల్లి లో చిరుమర్తి కార్యక్రమం లో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ నల్గొండ అభివృద్ధి పనుల పై సమీక్ష నిర్వహించారు.గతంలో ఆదేశించిన మేరకు ఏ యే పనులు ఎంతవరకు వచ్చాయని సీఎం ఆరా తీశారు.నల్లగొండ టౌన్ లో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో ‘నల్లగొండ కళాభారతి ‘ సాంస్కృతిక కేంద్రాన్ని 2000 మంది సామర్థ్యంతో తీర్చిదిద్దాలని అన్నారు.పానగల్లు ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ ను పచ్చదనం తో సుందరీకరించాలన్నారు.

నల్లగొండ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు సెలవుల్లో వచ్చి కుటుంబ సభ్యులు, పిల్లలతో ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.ఇందుకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్టుల నుంచి డిజైన్ లు తెప్పించుకోవాలని సీఎం అధికారులకు సూచించారు.ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు.ఫోటోలు నివేదికల ద్వారా పనుల పురోగతిని సీఎం పరిశీలించారు.కుటుంబం తో కలసి మార్కెట్ కు వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి, వారికి రక్షణ తో కూడిన పచ్చని పార్కు, ఆటస్థలంతో కూడిన చిల్డ్రన్ కేజ్ ను ఏర్పాటు చేయాలనీ సీఎం అన్నారు.నల్లగొండ టౌన్ లో వీలైన చోటల్లా అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు.నగరంలో పచ్చదనం, నర్సరీల గురించి సీఎం ఆరా తీశారు. విరివిగా మొక్కలు నాటడంతో పాటు, రహదారుల విస్తరణ, తదితర కారణాలతో తొలగిస్తున్న పెద్ద పెద్ద వృక్షాలను ట్రాన్స్ లొకేషన్ చేస్తున్నామనీ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సీఎంకు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news