టీఆర్ఎస్ పార్టీ చేసిన తీర్మాణాలపై సమాధానం ఇచ్చే దమ్ము లేక బీజేపీ పార్టీ ఎదురుదాడి చేస్తుందని విమర్శించారు ప్రభుత్వ విప్ బాల్కసుమన్. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట బీజేపీ పాపాల యాత్ర చేస్తుందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్లీనరీతో బీజేపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైందని… మీ బండారం గల్లీలో కాదు ఢిల్లీలో బయటపెడుతాం అని హెచ్చరించారు. ఇద్దరు దోస్తుల కోసం దేశ సంపదను బీజేపీ పంచిపెడుతుందని విమర్శించారు. ఇది కమలం పార్టీ కాదని కార్పొరేట్ పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల కోసం సంపదను పంచిపెడుతుందని బాల్క సుమన్ అన్నారు. 11 లక్షల కోట్ల బకాయిలను కార్పొరేట్లకు మాఫీ చేశారని విమర్శించారు. రాబోయే రోజుల్లో మీ డబుల్ ఇంజన్ కు దేశ ప్రజలు ఎర్రజెండాలు చూపెడుతారని అన్నారు. ఉన్నావ్, హత్రాస్ , లఖీంపూర్ ఖేరీ, లతిల్ మోదీ, నీరవ్ మోదీ ఇలా 8 ఏళ్ల బీజేపీ పాలనలో ఇవే జరిగాయని.. మతపరంగా విషబీజాలు నాటుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో కాళేశ్వరం రివర్స్ పంపింగ్, పాలమూరు రివర్స్ మైగ్రేషన్ జరుగుతుందని బాల్క సుమన్ అన్నారు. భారత దేశంలో అవినీతిని వ్యవస్థీకరించిన ఘనత మోదీకే దక్కుతుందని విమర్శలు చేశారు.
బీజేపీ కమలం పార్టీ కాదు… కార్పొరేట్ పార్టీ : బాల్క సుమన్
-