కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన మహారాష్ట్ర నేతలు

-

భారతదేశ పరివర్తనే లక్ష్యంగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి వలసల పరంపరం కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సుభిక్షంగా వర్ధిల్లుతున్న తెలంగాణ రాష్ట్రంలా తమ రాష్ట్రం ప్రగతిబాట పట్టాలని మహారాష్ట్ర నాయకులు, యువత, రైతులు బలంగా కోరుకుంటున్నారు.

ఈ క్రమంలో సోమవారం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో సోలాపూర్ నియోజకవర్గ గ్రామ సర్పంచులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్ వారికి గులాబి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలా మహారాష్ట్ర మరో వెలుగుజిలుగుల రాష్ట్రంగా అవతరించాలని ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీలో చేరిన సర్పంచులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పోరేషన ఛైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి, మహారాష్ట్ర బిఆర్ఎస్ ఇంచార్జి వంశీధర్ రావు, బిఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రావణ్, సోలాపూర్ ముఖ్య నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news