యాదాద్రిలో కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకున్నారు. కెసిఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సతీ సమేతంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలోనే కెసిఆర్ పిలుపునిచ్చారు.

ఇప్పటికే చాలామంది ప్రముఖులు, భక్తులు స్వామివారికి పసిడి సమర్పించారు. అయితే నేడు సీఎం కేసీఆర్ స్వామివారి గర్భగుడి గర్భగుడి దివ్య విమానానికి 16 తులాల బంగారాన్ని గతంలోనే ప్రకటించగా.. నేడు మనవడు హిమాన్షు చేతుల మీదుగా ఆ బంగారాన్ని అందజేశారు. సీఎం వెంట మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు.