తెలంగాణ రాష్ట్రంలో వరదలపై సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్… దేవాదుల ప్రాజెక్ట్ ముంపుపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని పేర్కొన్నారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని.. నియోజకవర్గాలు వదిలి ప్రజాప్రతినిధులు బయటకు రాకండని హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా కు అంతరాయం కాకుండా చూడాలని.. నెల రోజుల కోసం సరిపడే బొగ్గు ను సిద్దం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. వరదలు తగ్గగానే విత్తనాలు.. ఎరువులు సిద్దం చేసుకోవాలని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. కాగా.. తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.