రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే బీజేపీ అభ్యర్థులను ఈ అంశాలపై నిలదీయాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు. ముథోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ముథోల్‌లో ఇవాళ బీజేపీ పార్టీ అభ్యర్థిని మీరు క్వశ్చన్ అడగాలి అని కేసీఆర్ సూచించారు.
మోడీకి ప్రయివేటైజేషన్ పిచ్చి పట్టుకుంది. విమానాలు, ఓడరేవులు, రైల్వేలు, లోకమంతా ప్రయివేటు. చివరకు కరెంట్ కూడా ప్రయివేటు. బోర్ మోటార్ల కాడా మీటర్లు పెట్టాలని ఆర్డర్ చేశారు. నేను చెప్పిన పాణం పోయినా తల తెగిపడ్డా పెట్టను అని చెప్పను. ఏడాదికి వచ్చే రూ. 5 వేల కోట్లు కట్ చేస్తానని చెప్పాడు. అలా ఐదేండ్లకు కలిసి రూ. 25 వేల కోట్లు నష్టం చేసిండు. మనకు రావాల్సింది రాకుండా.. మీటర్లు పెట్టలేదు అని బంద్ పెట్టిండు. రైతాంగం నిలబడాలి. రైతులు ఆగమైపోయారు. రైతులు కచ్చితంగా బాగుపడాలి.
వ్యవసాయం బాగుండాలనే సిద్ధాంతో ఎంత ఒత్తిడి చేసినా మీటర్లు పెట్టలేదు. భవిష్యత్‌లో కూడా మీటర్లు పెట్టం. మీటర్లు పెట్టేటోళ్లకు ఓట్లు వేయమని చెప్పాలి. రూ. 25 వేల కోట్లు కట్ చేసిన పార్టీ ఇవాళ ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నావని ప్రశ్నించాలి. దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. కానీ తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. 50 ఉత్తరాలు రాశాను. ఎందుకు ఇవ్వలే. ఇదేం వివక్ష. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలి.