CM అంటే కటింగ్ మాస్టర్.. రేవంత్ పై కేటీఆర్ ఫైర్

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రుణమాఫీ అంతా బోగస్ అని తేలిపోయింది. స్వతంత్ర భారతదేశంలో నే ఇది అతి పెద్ద మోసం.ఒకే సంతకంతో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారు. రైతులను రేవంత్ రెడ్డి అడ్డంగా మోసం చేశారు.

ఎన్నికల ముందు ప్రతి రైతు కు రుణమాఫీ చేస్తాము అన్నారు. రేషన్ కార్డు కావాలని చెప్పలేదు. వెంటనే వెళ్లి రెండు లక్షలు తెచ్చుకోండి అన్నారు. నలభై వేల కోట్లు అన్నారు. కానీ చాలా కటింగ్ లు పెట్టారు. cm అంటే కటింగ్ మాస్టర్ అని నిరూపించారు. ఎన్నికల ముందు చెప్పని కొర్రీలు ఇప్పుడు పెడుతున్నారు. పంద్రాగస్టు వరకు రుణమాఫీ అన్నారు కదా అని మేము కూడా ఎదురు చూశాం. కానీ ఇప్పుడు అంతా మోసం అని అర్థం అయ్యిందని తెలిపారు. సీఎం స్థాయి వ్యక్తి గౌడన్నల వద్దకు వెళ్లి కల్లు మంచిదేనా.. ఏమైనా మందు వేశారా..? అని అనుమానిస్తారా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news