పారిపోయే ప్రయత్నం చేశానని టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని దేవినేని అవినాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి కేసులో దేవినేని అవినాష్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. అందుకు అనుగుణంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ ఫోర్టు నుంచి దుబాయ్ కి వెళ్తున్న అవినాష్ ని అడ్డుకున్నారు. దేవినేని అవినాష్ పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతించొద్దని పోలీసులు స్పష్టం చేశారు.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను పారిపోయే ప్రయత్నం చేశానని టీడీపీ అసత్య ప్రచారం చేస్తోంది. పారిపోవల్సిన ఖర్మ అవసరం నాకు లేదు. విజయవాడలో కార్యాలయంలో 24 గంటలు ఆందుబాటులో ఉంటున్నాను. కొర్టు మేము తప్పు చేసినట్టు ఏ శిక్ష అయినా నిర్ధారిస్తే దేనికైనా సిద్ధం. చంద్రబాబు ఇంటిపై డ్రోన్ ఎగుర వేసినపుడు ఛలో ఆత్మకూరు ప్రోగ్రామ్ కూడా అప్పట్లో నేను భయపడకుండా చేశాను. దేవినేని నెహ్రూ మాకు ధైర్యంగా ఉండటం కూడా నేర్పించారు అని పేర్కొన్నారు.