సీఎం రేవంత్ రెడ్డి కాదు..నువ్వు చిట్టి నాయుడు అంటూ సెటైర్లు పేల్చారు కేటీఆర్. పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. తొమ్మిదిన్నర నెలలుగా అసమర్థుడి జీవనయాత్ర లాగా రేవంత్ ప్రభుత్వం కొనసాగుతుందని.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి,రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిండని రేవంత్ రెడ్డిపై ఆగ్రహించారు.
ముఖ్యమంత్రి స్వయంగ ఎమ్మెల్యేల ఇంటికి చేరి కాళ్లు పట్టుకొని మరి కండువాలు కప్పుతాడని.. పది మంది ఎమ్మెల్యేలు పోయారు ఇంకా వస్తారు అని కాంగ్రెస్ మంత్రులు నుండి ఎమ్మెల్యేల వరకు మాట్లాడుతారని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు తర్వాత కాంగ్రెస్ లో భయం మొదలైందన్నారు. ఫిరాయింపులపై స్పీకర్ ని కలిసి సుప్రీంకోర్టు తీర్పలను సైతం ఉటంకిస్తూ పిర్యాదు చేసినం..దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి మీద డిస్ క్వాలిఫై పిటిషన్ వేసిందే కౌశిక్ రెడ్డి అని గుర్తు చేశారు.