కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట.. సీఎం రేవంత్ సెటైర్లు..!

-

రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్న బీజేపీ వారికి కొంత మంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వారు ఎలా మద్దతిస్తున్నారు అంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి.  కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా మీరు తాత్కాలిక, స్థానిక రాజకీయ లబ్ది కోసం బీజేపీకి మద్దతిస్తే అది రిజర్వేషన్లు రద్దుకు దారి తీస్తుందన్నారు. మేము ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ఈ వర్గాలకు 50 శాతానికి పైబడి రిజర్వేషన్లు ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ విధానం అన్నారు.

ఈ విధానం సమర్ధించాలంటే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని ఈ రిజర్వేషన్లు వద్దు, రద్దు చేయాలనుకునేవారు బీజేపీకి, ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ఏ వ్యవస్థను లెక్కపెట్టే వ్యక్తి కాదని,  370 ఆర్టికల్ రద్దు, యూనిఫామ్ సివిల్ కోడ్, జీస్టీ, నోట్ల రద్దు చూశాం. వాళ్లు చేయాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడుతారన్నారు. మోడీ పాలనలో పదేళ్ల మోసం- వందేండ్ల విధ్వంసం జరిగిందని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news