తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై.. మధ్య వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై.. కలిసిపోయారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.
అయితే.. ఆమెకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బేగం పోర్ట్ ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు. అయితే…రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన నేపథ్యంలోనే సీఎం కేసీఆర్, తమిళిసై ఎదురుపడ్డారు. గత కొంతకాలంగా ఉప్పు నిప్పు లాగా ఉన్న సీఎం కేసిఆర్, గవర్నర్ తమిళిసై.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి స్వాగతం పలికిన సందర్భంగా నవ్వుతూ పలకరించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.