సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల పటిష్టతకు ప్రభుత్వ ప్రోత్సహం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. MSME నూతన పాలసీ ఆవిష్కరించిన అనంతరం సభలో ప్రసంగించారు సీఎం. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని దళితులకు, గిరిజనులకు, మహిళలను సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల పటిష్టతకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చిన మంథనీ ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబును అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే పీవీ, మన్మోహన్ సింగే కారణం అన్నారు. పీవీ నరసింరావు ప్రధాని అయిన తరువాత పారిశ్రామిక విధానంలో మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా విధి, విధానాలను మార్చారు. పాలసీ లేకుండా ఏ ప్రభుత్వం కూడా నడవదన్నారు. 1995 నుంచి 2004 వరకు హైదరాబాద్ చాలా డెవలప్ అయింది. మంచి పనులు ఎవ్వరూ చేసినా వాటిని కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలుంటే వాటిని తొలగించడానికి ప్రభుత్వం వెనక్కి పోదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందుతున్నారు.. కానీ వారి పట్ట అక్కడ అవసరానికి సరిపోవడం లేదన్నారు.