కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడుదొంగల్లా మారి కెసిఆర్ పై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు: మంత్రి మల్లారెడ్డి

75 ఏళ్ల లో ఏ ప్రభుత్వము కార్మిక లోకానికి ఒక్క మంచి పని కూడా చేయలేదని అన్నారు మంత్రి మల్లారెడ్డి.ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి సింగరేణి సంస్థలో ఉంటున్న పేదలకు పట్టాలు ఇప్పించిన ఘనత బాల్క సుమన్ కే దక్కుతుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తూ నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.

అయినా కూడా కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని తెలిపారు.గుజరాత్ మహిళలు తాగునీటి కోసం ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ రాసినా ఇప్పటి వరకు ఆ సమస్య తీరలేదు అన్నారు.కానీ ఇక్కడ సీఎం కేసీఆర్ ఒక ఇంజనీర్ లా నిలబడి మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నారని కొనియాడారు.కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడుదొంగల్లా మారి కేసీఆర్ పై అసత్యపు ప్రచారాలతో పబ్బంగడుపుతున్నారని మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు.