తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా రేసులోకి వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటివరకు బిఆర్‌ఎస్, బిజేపి రాజకీయ యుద్ధంలో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. పైగా అంతర్గత సమస్యలతో సతమతమైంది. దీంతో ఇంకా కాంగ్రెస్ కోలుకోవడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం…తెలంగాణకు ప్రియాంక గాంధీ వచ్చి పలు హామీలు ఇవ్వడం, నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తుండటం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది.
దీంతో తెలంగాణలో బిజేపిని వెనక్కి నెట్టి కాంగ్రెస్ రెండోస్థానంలోకి వచ్చింది. ఇప్పుడు బిఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారం కైవసం చేసుకోవాలని చూస్తుంది. అయితే బిఆర్‌ఎస్ పార్టీని నిలువరించి అధికారం దక్కించుకోవడం అంత సులువు కాదు. కేసిఆర్ లాంటి వారి వ్యూహాలని ఎదురుకుని నిలబడటం కాస్త కష్టమే. కానీ కాంగ్రెస్ నేతలంతా ఐక్యతతో కలిసి పనిచేస్తే గెలుపు పెద్ద ఇబ్బంది కాదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మొహమాటం పడకుండా గెలిచే వారికే సీట్లు ఇవ్వాలి. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటున్నారని, బలం లేని సీనియర్ నేతలకు సీట్లు ఇస్తే ప్రయోజనం ఉండదు. అలాగే పార్టీలోకి వలసలని ఇంకా ప్రోత్సహించాలి.
అయితే ఇప్పుడు ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తుంది. బిజేపి, బిఆర్‌ఎస్ ల్లో ఉన్న కీలక నేతలని కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి చూస్తున్నారు. అది కూడా గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వారినే వెనక్కి తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే జూపల్లి, పొంగులేటి లాంటి వారు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమవుతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి నాయకుడుని వెనక్కి తీసుకురావాలని చూస్తున్నారు. ఇంకా పలువురు నేతలని వెనక్కి తెచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇక మొహమాటం పడకుండా సరిగ్గా యాక్టివ్ లేని సీనియర్ నేతలకు సీట్లు ఇవ్వకూడదు అని..పైగా వరుసగా ఓడిపోతున్న నేతలని సైడ్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి కాంగ్రెస్ స్ట్రాటజీలు వర్కౌట్ అవుతాయో లేదో.