కాంగ్రెస్ మాటలు ఆకాశంలో.. చేతలు పాతాళంలో : కేటీఆర్

-

కాంగ్రెస్ మాటలు ఆకాశంలో.. చేతలు పాతాళంలో ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ ఆదిలాబాద్ లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ 09 నాడే రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తానన్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 120 రోజులు అయింది. ఇప్పుడు పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తామని చెబుతున్నారు. అప్పుడైనా చేస్తారా..? లేక మరే సాకు చెబుతారా..? అని ప్రశ్నించారు. ఆసిఫాబాద్ మన్యంలో కూడా ఇంటింటికి తాగునీరు అందించామని తెలిపారు కేటీఆర్.

కాంగ్రెస్ వచ్చింది.. కరువు వచ్చింది. నీళ్ల కోసం మళ్లీ దేవులాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మొన్న రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ భర్తీ చేసినవే అన్నారు. కాంగ్రెస్ మోసాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో భారీ మార్పులు జరుగుతాయన్నారు. గెలిచిన ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్నారు. ఆరు గ్యారెంటీల అమలును కాంగ్రెస్ విస్మరించిందని పేర్కొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news