కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ ప్రజలపై విరుచుకపడటంతో థర్డ్ వేవ్ వచ్చింది. థర్డ్ వేవ్ లో కూడా చాలా మంది జీవితలు చిన్నా భిన్నం అయ్యాయి. అయితే మొదటి రెండు వేవ్‌ల కన్న థర్డ్ వేవ్ లో కాస్త మరణాల సంఖ్య తగ్గింది. కానీ కేసుల సంఖ్య విపరీతంగా వచ్చింది. తెలంగాణలో కూడా థర్డ్ వేవ్ కారణంగా కరోనా కేసులు భారీగా పెరిగాయి. అయితే థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత చాలా రోజులకు రాష్ట్రంలో వేయ్యి లోపు కరోనా కేసులు వెలుగు చూశాయి.
దీంతో కరోనా వ్యాప్తి చాలా వరకు తగ్గుముఖం పట్టినట్టే. బుధవారం రాత్రి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన కరోనా బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కేవలం 865 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగు చూశాయి. 61,573 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినా.. కేవలం 865 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో థర్డ్ వేవ్ దాదాపు ముగిసినట్టే అని తెలుస్తుంది. ఇప్పటికే డీహెచ్ వో శ్రీనివస్ కూడా థర్డ్ వేవ్ ముగిసిందని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగ బుధవారం కరోనా మహమ్మారి వల్ల ఒకరు మరణించారు. అలాగే 2,484 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 19,850 యాక్టివ్ కేసులు ఉన్నాయి.